Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట... మధ్యంతర బెయిల్ మంజూరు

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ ను మార్చి 21న అరెస్ట్ చేసిన ఈడీ
  • సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న కేజ్రీవాల్
  • నేడు కేజ్రీవాల్ కు ఊరట కలిగిస్తూ మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court granted interim bail to Arvind Kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు నేడు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు ఈ మధ్యంతర బెయిల్ వర్తిస్తుందని, తిరిగి జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుందని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. కోర్టు కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కస్టడీ పొడిగించారు. ఈ నేపథ్యంలో, నేడు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఆయనకు పెద్ద ఊరట అని చెప్పాలి.

  • Loading...

More Telugu News